కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా చదవాలి?

బైబిలు ఎందుకు చదవాలి?

బైబిలు ఎందుకు చదవాలి?

“బైబిలును అర్థం చేసుకోవడం చాలా కష్టమని నేను అనుకున్నాను.”—జూవి

“బైబిలు చదవడం బోర్‌ అని అనుకున్నాను.”—క్వీనీ

“ఇంత పెద్దగా ఉన్న బైబిల్ని చూసి, నాకు చదవాలన్న ఆశ పోయింది.”—ఇజిక్యల్‌

మీరు ఎప్పుడైనా బైబిలు చదవాలని అనుకున్నా పైనున్న కారణాల వల్ల చదవకుండా ఆగిపోయారా? చాలామందికి బైబిలు చదవడం అంటే భయం. కానీ సంతోషంగా, సంతృప్తిగా ఉండడానికి బైబిలు మీకు సహాయం చేస్తే? కొన్ని పద్ధతుల్లో చదివినప్పుడు ఆసక్తికరంగా ఉంటే? అప్పుడు బైబిలు మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా?

బైబిలు చదవడం మొదలుపెట్టాక ఎలాంటి ప్రయోజనాలు పొందారో కొంతమంది చెప్తున్న మాటలను గమనించండి.

ఇరవై ఐదు సంవత్సరాల్లోపు వయసున్న ఇజిక్యల్‌ ఇలా అంటున్నాడు: “నేను ఇంతకుముందు, ఎక్కడకు వెళ్లాలో తెలియకుండా కారు నడిపే వ్యక్తిలా ఉన్నాను. కానీ బైబిలు చదవడం మొదలుపెట్టాక నా జీవితం చాలా అర్థవంతంగా ఉంది. నాకు రోజూ ఉపయోగపడే సలహాలు అందులో ఉన్నాయి.”

ఇరవైలలో ఉన్న ఫ్రీడా ఇలా అంటోంది: “నాకు చాలా కోపం ఉండేది. కానీ బైబిలు చదవడం మొదలుపెట్టాక కోపం తగ్గించుకోవడం నేర్చుకున్నాను. దానివల్ల నేను అందరితో కలిసిపోయాను, ఇప్పుడు నాకు ఎక్కువమంది ఫ్రెండ్స్‌ ఉన్నారు.”

యాభైలలో ఉన్న యునిస్‌ బైబిలు గురించి ఇలా చెప్తుంది, “నేను మంచి వ్యక్తిగా మారడానికి, అంత మంచివి కాని అలవాట్లను మార్చుకోవడానికి అది నాకు సహాయం చేసింది.”

ఆ కొంతమందే కాదు, ఎన్నో లక్షలమంది బైబిలు చదవడం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందుతున్నారు. మీరు కూడా పొందవచ్చు. (యెషయా 48:17, 18) ఎన్నో విషయాలతోపాటు, బైబిలు (1) సరైన నిర్ణయాలు తీసుకునేలా, (2) మంచివాళ్లతో స్నేహం చేసేలా, (3) ఒత్తిడిని తట్టుకునేలా (4) అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని గురించిన సత్యం తెలుసుకునేలా మీకు సహాయం చేస్తుంది. బైబిల్లో ఉన్న సలహాలు దేవుని నుండి వచ్చాయి కాబట్టి వాటిని పాటిస్తే మీరు మోసపోరు. దేవుడు ఎప్పుడూ చెడు సలహాలు ఇవ్వడు.

బైబిలు చదవడం మొదలుపెట్టడమే ముఖ్యం. మొదలుపెట్టి, ఆనందిస్తూ చదవడానికి ఏమి చేస్తే బాగుంటుంది?