కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచాలంటే ఏంచేయాలి?

మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం నేర్పిస్తున్నారా?

పిల్లలు చక్కగా పెరగాలంటే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. (కొలొస్సయులు 3:14, 19) యెహోవా దేవుడు తన కుమారున్ని మెచ్చుకున్నాడు. మంచి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగే ప్రేమిస్తారు, మెచ్చుకుంటారు.—మత్తయి 3:17 చదవండి.

తన సేవకులు చెప్పేవాటిని మన పరలోక తండ్రి వింటాడు, వాళ్ల భావాల్ని, ఆలోచనల్ని పట్టించుకుంటాడు. తల్లిదండ్రులు కూడా దేవునిలానే పిల్లలు చెప్పేవాటిని వినాలి. (యాకోబు 1:19) తల్లిదండ్రులు పిల్లల భావాలను అర్థం చేసుకోవాలి. పిల్లలు చెప్పేవి, చేసేవి కొన్నిసార్లు చిరాకు తెప్పించినా వాళ్లను అర్థం చేసుకోవాలి.—సంఖ్యాకాండము 11:11, 15 చదవండి.

మీ పిల్లల్ని బాధ్యతగల వాళ్లుగా ఎలా పెంచవచ్చు?

ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పే హక్కు తల్లిదండ్రులుగా మీకు ఉంది. (ఎఫెసీయులు 6:1) దేవుడు కూడా ఏమిచేయాలో, ఏమి చేయకూడదో చెబుతూ పిల్లలపై ప్రేమ చూపించాడు. మాట వినకపోతే ఏమి జరుగుతుందో కూడా వివరించాడు. మీరూ అలానే చేయండి. (ఆదికాండము 3:3) చెప్పిన మాట వినమని బలవంతపెట్టే బదులు, సరైనది చేస్తూ ఎలా సంతోషంగా ఉండవచ్చో దేవుడు నేర్పిస్తాడు.—యెషయా 48:18, 19 చదవండి.

మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం నేర్పించండి. దానివల్ల మీరు పక్కన లేనప్పుడు కూడా వాళ్లు చక్కగా నడుచుకుంటారు. దేవుడు అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటూ మనకు నేర్పిస్తున్నాడు. మీరూ అలాగే అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉంటూ మీ పిల్లలకు నేర్పించండి.—ద్వితీయోపదేశకాండము 6:5-7; ఎఫెసీయులు 4:32; 5:1 చదవండి. (w15-E 06/01)