కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఇది చాలా కొత్తగా ఉంది”

“ఇది చాలా కొత్తగా ఉంది”

దక్షిణ కొరియాలో హై స్కూల్‌లో కౌన్సలర్‌గా పనిచేస్తున్న సూ-జుంగ్‌, jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలను తన క్లాస్‌లో చూపించింది. ఆమె ఇలా అంటోంది: ఎవరు నిజమైన ఫ్రెండ్‌? అనే వీడియోను చూపించగానే స్టూడెంట్స్‌ అద్భుతంగా స్పందించారు. దాన్ని చూసి వాళ్లు ఇలా అన్నారు: ‘ఫ్రెండ్‌షిప్‌ గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది చాలా కొత్తగా ఉంది.’ ఏదైనా సలహా అవసరమైనప్పుడు ఈ వెబ్‌సైట్‌ చూస్తామని కొంతమంది చెప్పారు.” సూ-జుంగ్‌ ఇంకా ఇలా చెప్తుంది: “నాలా స్కూళ్లలో కౌన్సలర్లుగా పని చేసే చాలామందికి ఈ వీడియో గురించి చెప్పాను, క్లాసుల్లో సహాయపడే ఇంత మంచి పరికరం దొరికినందుకు వాళ్లు సంతోషించారు.”

దక్షిణ కొరియాలో చాలామంది స్టూడెంట్స్‌కు సహాయం చేసిన మరో వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి. జువెనైల్‌ వైలెన్స్‌ ప్రివెన్‌షన్‌ ఫౌండేషన్‌లో పనిచేసే లెక్చరర్‌ ఒక క్లాస్‌లో పిల్లలకు ఈ వీడియో చూపించింది. “ఆ వీడియోలో ఉన్న చక్కని చిత్రాలు చాలామంది యవ్వనుల అవధానాన్ని కట్టిపడేశాయి” అని ఆమె అంటుంది. “దౌర్జన్యం నుండి ఎలా కాపాడుకోవాలనే కాదు అసలు ఆ పరిస్థితి రాకుండా ఎలా ఆపాలో కూడా ఈ వీడియో చూపిస్తుంది.” ఆ ఫౌండేషన్‌ చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు పాఠాలు బోధిస్తున్నప్పుడు ఈ వీడియోను ఉపయోగించడానికి అనుమతిని తీసుకుంది. పొలిస్‌ అధికారులు కూడా jw.orgలో ఉన్న వీడియోలను ఉపయోగిస్తున్నారు.

మీరు ఇంకా ఈ వెబ్‌సైట్‌ని చూడకపోతే, ఇప్పుడే ఎందుకు చూడకూడదు? ఇందులో ఉన్నవాటన్నిటిని చాలా సులువుగా చూడవచ్చు, ఆడియో వీడియోలను, బైబిల్‌ను ఇంకా ఎన్నో ప్రచురణలను ఉచితంగా డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. ◼ (g16-E No. 5)