కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమ ఉంటే మన అవసరాలకన్నా ఇతరుల అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం

సాటిమనిషి మీద ప్రేమ చూపించాలి

సాటిమనిషి మీద ప్రేమ చూపించాలి

మానవులందరూ మొదటి మనిషైన ఆదాము నుండి వచ్చారు కాబట్టి మనందరిదీ ఒకే కుటుంబం. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవం చూపించుకోవాలి; కానీ ఈరోజుల్లో ప్రేమ కరువైపోయింది. మనల్ని ప్రేమించే దేవుడు కోరుకుంటున్నది ఇది కాదు.

ప్రేమ గురించి పవిత్ర లేఖనాలు ఏం చెప్తున్నాయి?

“నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.”—లేవీయకాండం 19:18.

“మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి.”—మత్తయి 5:44.

సాటిమనిషిని ప్రేమించడం అంటే ఏంటి?

దేవుడు తన వాక్యంలో ప్రేమను ఎలా వర్ణిస్తున్నాడో 1 కొరింథీయులు 13:4-7 వచనాల్లో చూడండి:

“ప్రేమ ఓర్పు, దయ చూపిస్తుంది.”

ఆలోచించండి: మీరు పొరపాట్లు చేసినప్పుడు ఇతరులు మీమీద కోప్పడకుండా మీతో ఓర్పుగా, దయగా ఉంటే మీకెలా అనిపిస్తుంది?

“ప్రేమ అసూయపడదు.”

ఆలోచించండి: ఎవరైనా మీమీద అసూయపడుతుంటే మీకెలా అనిపిస్తుంది?

ప్రేమ “సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు.”

ఆలోచించండి: ఇతరులు వాళ్ల మాటే నెగ్గాలని అనుకోకుండా, మీ అభిప్రాయాల్ని కూడా గౌరవిస్తే మీకెలా అనిపిస్తుంది?

“ప్రేమ హానిని మనసులో పెట్టుకోదు.”

ఆలోచించండి: చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపపడేవాళ్లను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. “ఆయన ఎప్పుడూ తప్పులు వెతుకుతూ ఉండడు, ఎల్లకాలం కోపం పెట్టుకోడు.” (కీర్తన 103:9) మనవల్ల బాధపడినవాళ్లు మనల్ని క్షమిస్తే మనకు సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా, మనల్ని బాధపెట్టిన వాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.—కీర్తన 86:5.

ప్రేమ “చెడు విషయంలో సంతోషించదు.”

ఆలోచించండి: మన బాధను చూసి ఇతరులు సంతోషించాలని అనుకోం. కాబట్టి వేరేవాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్లు మనల్ని బాధపెట్టినవాళ్లైనా సరే మనం వాళ్లను చూసి సంతోషించకూడదు.

ఇతరుల వయసు, దేశం, మతం ఏదైనా మనం అందర్నీ ప్రేమించాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా ప్రేమ చూపించడానికి ఒక మార్గం ఏంటంటే, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం.