కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు సమకూడే స్థలాన్ని చర్చి అని ఎందుకు అనరు?

యెహోవాసాక్షులు సమకూడే స్థలాన్ని చర్చి అని ఎందుకు అనరు?

 బైబిల్లో, “చర్చి” అని అనువాదమైన గ్రీకు పదం, ఒక ఆరాధకుల గుంపును సూచిస్తుందే కానీ వాళ్లు సమకూడే భవనాన్ని కాదు.

 ఈ ఉదాహరణను గమనించండి: అకుల, ప్రిస్కిల్ల అనే క్రైస్తవ జంటకు అపొస్తలుడైన పౌలు తన క్రైస్తవ ప్రేమను తెలుపుతున్నప్పుడు ఇలా అన్నాడు: “వారి ఇంట ఉన్న చర్చికి వందనములు చెప్పుడి.” (రోమీయులు 16:5, కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌) పౌలు తన క్రైస్తవ ప్రేమను తెలపాలనుకున్నది ఒక భవనానికి కాదు, ప్రజలకు అంటే ఆ ఇంట్లో సమకూడే సంఘానికి. a

 అందుకే మా ఆరాధనా స్థలాన్ని “చర్చి” అని కాకుండా “రాజ్యమందిరం” అని అంటాం.

“యెహోవాసాక్షుల రాజ్యమందిరం” అని ఎందుకు అంటాం?

 ఈ పేరు సరిగ్గా సరిపోతుందని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి:

  •   ఆ భవనం ఒక హాలు (సభా మందిరం), ప్రజలు సమకూడే స్థలం.

  •   దేవుడని బైబిలు చెబుతున్న యెహోవాను ఆరాధించడానికి, ఆయన గురించి సాక్ష్యమివ్వడానికి మేము సమకూడతాం.—కీర్తన 83:18; యెషయా 43:12.

  •   యేసు ఎక్కువగా మాట్లాడిన దేవుని రాజ్యం గురించి నేర్చుకోవడానికి కూడా అక్కడ సమకూడతాం.—మత్తయి 6:9, 10; 24:14; లూకా 4:43.

 మీకు దగ్గర్లో ఉన్న రాజ్యమందిరాన్ని సందర్శించి, యెహోవాసాక్షులు తమ కూటాలు ఎలా జరుపుకుంటారో స్వయంగా చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

a 1 కొరింథీయులకు 16:19 లో, కొలొస్సయులకు 4:15 లో, ఫిలేమోను 2 లో కూడా అలాంటి పదబంధాలే కనిపిస్తాయి.