కంటెంట్‌కు వెళ్లు

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?

బైబిలు ఇచ్చే జవాబు

 మనం యేసు పేరిట దేవునికి ప్రార్థించాలి. ఎందుకంటే మనం తనకు దగ్గరవడానికి దేవుడు ఆమోదించిన మార్గం అదొక్కటే. యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని చెప్పాడు. (యోహాను 14:6) “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని కూడా యేసు తన నమ్మకమైన అపొస్తలులకు చెప్పాడు.—యోహాను 16:23.

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలనేదానికి మరికొన్ని కారణాలు

  •   మనం యేసును, ఆయన తండ్రైన యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తాం.—ఫిలిప్పీయులు 2:9-11.

  •   యేసు మరణం, మనల్ని రక్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటని, దాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తాం.—మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 4:12.

  •   దేవునికి, మనుషులకు మధ్యవర్తిగా యేసుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తిస్తాం.—హెబ్రీయులు 7:25.

  •   మనం దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి, యేసు ఓ ప్రధాన యాజకునిగా మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే ఈ సేవను మనం గౌరవిస్తాం.—హెబ్రీయులు 4:14-16.