కంటెంట్‌కు వెళ్లు

మన బాధలకు దేవుడే కారణమా?

మన బాధలకు దేవుడే కారణమా?

బైబిలు ఇచ్చే జవాబు

 మన బాధలకు దేవుడు కారణం కాదని బైబిలు ఖచ్చితంగా చెబుతుంది. మనుషులు బాధలు అనుభవించాలని దేవుడు ఉద్దేశించలేదు. అది ఆయన సంకల్పంలో భాగం కానేకాదు. అయితే, మొదటి మానవ దంపతులు మంచి చెడులను తమకు తామే నిర్ణయించుకోవాలని అనుకోవడం ద్వారా దేవుని పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అలా వాళ్లు దేవునికి దూరమై చెడు ఫలితాలను అనుభవించారు.

 వాళ్ల తప్పుడు నిర్ణయం వల్ల వచ్చిన పర్యవసానాలను మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం. అంతేగానీ, మన బాధలకు ఏ విధంగానూ దేవుడు కారణం కాదు.

 బైబిలు ఇలా చెబుతుంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13) దేవుని ఆమోదం ఉన్నవాళ్లకు కూడా కష్టాలు వస్తాయి.