కంటెంట్‌కు వెళ్లు

పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రజలు “లైంగిక పాపానికి దూరంగా ఉండాలి అనేదే దేవుని ఇష్టం” అని బైబిలు చెప్తుంది. (1 థెస్సలొనీకయులు 4:3) బైబిల్లో “లైంగిక పాపం” అంటున్నప్పుడు అక్రమ సంబంధాలు, మగవాళ్లు-మగవాళ్ల మధ్య ఆడవాళ్లు-ఆడవాళ్ల మధ్య లైంగిక సంబంధం, పెళ్లికాని స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధం వంటివి వస్తాయి.

 ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటారా లేక పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తారా అనేది దేవుడు పట్టించుకుంటాడా?

  •   పెళ్లి ఏర్పాటు చేసింది దేవుడే. మొట్టమొదటి మానవ జంటను ఒకటి చేసినప్పుడు, దేవుడు పెళ్లి అనే ఏర్పాటును చేశాడు. (ఆదికాండం 2:22-24) ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే బదులు, పెళ్లి చేసుకుని ఒకరికొకరు నమ్మకంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం.

  •   మనకు ఏది మంచిదో దేవునికి బాగా తెలుసు. పెళ్లి ఒక చిరకాల బంధంగా ఉండాలనే దేవుడు తయారుచేశాడు. ఎందుకంటే, అది కుటుంబంలో ఉన్న అందరికీ మంచి చేస్తుందని ఆయనకు తెలుసు. ఉదాహరణకు, మీరు ఏదైనా టేబుల్‌ గానీ, కుర్చీ గానీ కొనుక్కొచ్చారు అనుకోండి. దాన్ని ఎలా బిగించాలో దాన్ని తయారుచేసిన వ్యక్తి కొన్ని సూచనలు ఇస్తాడు. అదేవిధంగా, వివాహబంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పేవి పాటించేవాళ్లు ఎప్పుడూ ప్రయోజనం పొందుతారు.—యెషయా 48:17, 18.

    ఒక వస్తువును తయారుచేసిన వ్యక్తి దాన్ని ఎలా బిగించాలో సూచనలు ఇస్తాడు. అలాగే ఒక విజయవంతమైన కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుడు సూచనలు ఇస్తున్నాడు

  •   పెళ్లికాకుండా లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్లు ఘోరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు వాళ్లు అవాంఛిత గర్భధారణ, సుఖవ్యాధులు, మానసిక వేదన వంటి పర్యవసానాలు ఎదుర్కొంటారు.

  •   స్త్రీపురుషులు సెక్స్‌ ద్వారా పిల్లల్ని కనే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు జీవాన్ని విలువైనదిగా చూస్తాడు. పిల్లల్ని కనే సామర్థ్యం ఒక అమూల్యమైన బహుమతి. పెళ్లికాకుండా పిల్లల్ని కని ఆ బహుమతిని దుర్వినియోగం చేస్తే, దేవుడు సంతోషించడు. కానీ, పెళ్లి అనే గౌరవప్రదమైన ఏర్పాటు ద్వారా పిల్లల్ని కని ఆ బహుమతి పట్ల గౌరవం చూపిస్తే, దేవుడు సంతోషిస్తాడు.—హెబ్రీయులు 13:4.

 ఒకరికొకరు సరిపోతామో లేదో అని పెళ్లికి ముందే కలిసి జీవించి చూసుకోవచ్చా?

 ఒక విజయవంతమైన వివాహానికి కావల్సింది అది కాదు. ఎందుకంటే, పెళ్లికి ముందు కలిసి జీవించే ఆ సమయంలో ఇద్దరిలో ఎవరైనా ఎప్పుడైనా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెళ్లి అనే ఏర్పాటులో నిబద్ధత ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు కట్టుబడి ఉన్నప్పుడు, కలిసికట్టుగా సమస్యలతో పోరాడినప్పుడు వాళ్ల బంధం బలంగా ఉంటుంది. aమత్తయి 19:6.

 దంపతులు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే ఏం చేయవచ్చు?

 గొడవలు రాని కుటుంబమంటూ ఏదీ ఉండదు. అయినా, దంపతులు బైబిలు సలహాల్ని పాటిస్తూ అన్యోన్యంగా జీవించవచ్చు. ఉదాహరణకు, కొన్ని బైబిలు సలహాల్ని పరిశీలించండి:

a తేజరిల్లు! నం. 2 2018 లో, “వివాహానికి కట్టుబడి ఉండడం” అనే ఆర్టికల్‌ చూడండి.