కంటెంట్‌కు వెళ్లు

ఈస్టర్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఈస్టర్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 ఈస్టర్‌ను చేసుకోమని బైబిల్లో ఎక్కడా లేదు. ఈ పండుగ చరిత్రను గమనిస్తే, ఈస్టర్‌ అనే పేరుకున్న నిజమైన అర్థాన్ని తెలుసుకోవచ్చు. ఇది పిల్లలు పుట్టడానికి ప్రజలు ఆచరించే పురాతన మత ఆచారం. కింది వాటిని పరిశీలించండి.

  1.   పేరు:ఈస్టర్‌ అనే ఇంగ్లీషు పదం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియదు; దీన్ని, 8వ శతాబ్దంలోని వెనెరబల్‌ బేడ్‌ అనే ఆంగ్లో-శాక్సన్‌ ప్రీస్టు తాము ఆరాధించే వసంతకాల దేవత అయిన ఈస్ట్రే పేరు నుండి తీసుకున్నాడు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. అయితే ఇతర గ్రంథాలు ఈస్టర్‌ పేరును, బబులోనులోని ఇష్తార్‌కు సమానమైన ఫేనీకేయుల సంతాన దేవత అస్టార్టెతో ముడిపెడుతున్నాయి.

  2.   కుందేళ్లు: “వీటిని పురాతన ఆచారాల్లో, ఐరోపా-మధ్య ప్రాచ్య దేశాల్లోని అన్యమతాలవాళ్లు వసంతకాలంలో జరుపుకునే పండుగల్లో” సంతాన సాఫల్యతకు చిహ్నాలుగా వాడేవాళ్లు.—ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.

  3.   గుడ్లు: ఈస్టర్‌ కుందేలు తీసుకొచ్చిన ఈస్టర్‌ గుడ్లు కోసం వెతకడం అనేది, “కేవలం చిన్నపిల్లలు సరదాగా ఆడుకునే ఆట మాత్రమే కాదుగానీ, సంతానప్రాప్తి కోసం చేసే ఆచారానికి సంబంధించినది” అని ఫంక్‌ అండ్‌ వాగ్నల్స్‌ స్టాండర్డ్‌ డిక్షనరీ ఆఫ్‌ ఫోక్‌లోర్‌, మైతాలజీ అండ్‌ లెజెండ్‌ చెప్తోంది. అందంగా అలంకరించిన ఈస్టర్‌ గుడ్డు “అద్భుతరీతిలో సంతోషాన్ని, సిరిసంపదలను, మంచి ఆరోగ్యాన్ని, రక్షణను తీసుకొస్తుంది” అని కొన్ని సంస్కృతులవాళ్లు నమ్మేవాళ్లు.”—ట్రెడిషనల్‌ ఫెస్టివల్స్‌.

  4.   ఈస్టర్‌ కొత్త వస్త్రధారణ: “కొత్త బట్టలు వేసుకోకుండా వసంతకాల దేవతైన స్కాండినేవియన్‌ లేదా ఈస్ట్రేకు నమస్కరించడాన్ని అగౌరవంగా, అశుభంగా భావించేవాళ్లు.”—ది జైంట్‌ బుక్‌ ఆఫ్‌ సూపర్‌స్టీషన్స్‌.

  5.   సూర్యోదయ కార్యక్రమాలు: పూర్వకాలంలోని సూర్యుని ఆరాధకులు “వసంత ఋతువులో రాత్రి పగలు సమానంగా ఉండే రోజున, వృద్ధి చెందే వాటన్నిటికి కొత్త జీవాన్ని ఇచ్చే సూర్యుణ్ణి, దాని గొప్ప శక్తిని ఆహ్వానిస్తూ” చేసే ఆచారాలతో వీటిని ముడిపెట్టారు.—సెలబ్రేషన్స్‌—ది కంప్లీట్‌ బుక్‌ ఆఫ్‌ అమెరికన్‌ హాలిడేస్‌.

 ది అమెరికన్‌ బుక్‌ ఆఫ్‌ డేస్‌ ఈస్టర్‌ మూలాలను చక్కగా వివరిస్తూ ఇలా చెప్తుంది: “తొలి రోజుల్లో చర్చివాళ్లు, అన్యమతాల ప్రజలు ఆచరించే పురాతన ఆచారాలను పాటించడం మొదలుపెట్టి వాటిని క్రైస్తవత్వానికి ముడిపెట్టారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.”

 దేవునికి ఇష్టంలేని పద్ధతులు లేక ఆచారాలను పాటిస్తూ ఆయనను ఆరాధించకూడదని బైబిలు హెచ్చరిస్తుంది. (మార్కు 7:6-8) రెండవ కొరింథీయులు 6:16-18 ఇలా చెప్తుంది: “ ‘వేరుపడి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు చెపుతున్నాడు, ‘కల్మషమైనదానిని ముట్టకండి.’ ” ఈస్టర్‌ అనేది ఒక అన్యమత పండుగ. దేవుని సంతోషపెట్టాలి అనుకునేవాళ్లు దాన్ని చేయరు.—పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.