కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ సంజ్ఞా భాష

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ సంజ్ఞా భాష

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ సంజ్ఞా భాష

JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌, కింది ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో ఒకదానితో నడిచే డివైజ్‌లలో పనిచేస్తుంది:

  • ఆండ్రాయిడ్‌ 5.1 లేదా ఆ తర్వాతి వర్షన్‌

  • iOS 12.0 లేదా ఆ తర్వాతి వర్షన్‌

  • M1 లేదా ఆ తర్వాతి చిప్‌ ఉన్న macOS

  • విండోస్‌ 10 వర్షన్‌ 1903 లేదా ఆ తర్వాతివి

JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌ని సురక్షితంగా, నమ్మదగినదిగా ఉంచాలంటే ఒక్కోసారి దాన్ని నడిపించడానికి అవసరమైన కనీస ప్రమాణాల్ని పెంచాల్సి ఉంటుంది. కాబట్టి, మీ డివైజ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండమని కోరుతున్నాం. మీరు ఒకవేళ మీ డివైజ్‌ని అవసరమైన కనీస వర్షన్‌కి అప్‌డేట్‌ చేయలేకపోతే అప్పుడు కూడా ఆప్‌ నడుస్తుంది, కానీ కొత్త ఫీచర్లు అందులో ఉండవు.

 

మీరు ఒక ప్రచురణను డౌన్‌లోడ్‌ చేసినప్పుడు, JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌ అధ్యాయాల పేర్లు, చిత్రాలతో పాటు విషయసూచిక పేజీని డౌన్‌లోడ్‌ చేస్తుంది.

ఆ ప్రచురణకు సంబంధించిన వీడియోలన్నీ డౌన్‌లోడ్‌ చేయడానికి, యాప్‌ పైభాగంలో ఉన్న డౌన్‌లోడ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయండి, లేదా ప్రత్యేకించి ఒక వీడియోను డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటే ఆ వీడియో పక్కన ఉన్న డౌన్‌లోడ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌తో పరిచయం ఉన్న మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. లేదంటే, దయచేసి మీకు దగ్గరలో ఉన్న మా బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.