కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ సంజ్ఞా భాష

ఆండ్రాయిడ్‌లో యాప్‌స్టోర్‌లేకపోతే JW లైబ్రరీ సంజ్ఞా భాష ఇన్‌స్టాల్‌చేసుకోవడం

ఆండ్రాయిడ్‌లో యాప్‌స్టోర్‌లేకపోతే JW లైబ్రరీ సంజ్ఞా భాష ఇన్‌స్టాల్‌చేసుకోవడం

మీ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లో అధికారిక యాప్‌ స్టోర్‌ ద్వారా, అంటే గూగుల్‌ ప్లే స్టోర్‌, అమేజాన్‌ యాప్‌స్టోర్‌ వంటివాటి ద్వారా JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోలేకపోతే, JW లైబ్రరీ సంజ్ఞా భాష ఆండ్రాయిడ్‌ ప్యాకేజ్‌ కిట్‌ (APK) సహాయంతో మీరే దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

JW లైబ్రరీ సంజ్ఞా భాష APKని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే, మీ డివైజ్‌లోని “install unknown apps” లేదా “allow installation from unknown sources” అనే సెట్టింగ్‌ను ఆన్‌ చేసుకోవాల్సి రావచ్చు. అదెలా చేయాలో తెలుసుకోవడానికి, మీ ఆండ్రాయిడ్‌ డివైజ్‌కి సంబంధించిన మాన్యువల్‌ చూడండి.

JW లైబ్రరీ సంజ్ఞా భాష APKని డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసే పద్ధతి:

  1. APK ఫైల్‌ని మీ డివైజ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, ఈ పేజీలో ఉన్న డౌన్‌లోడ్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి.

  2. మీ డివైజ్‌లో డౌన్‌లోడ్‌ అయిన APK ఫైల్‌ని కనుగొని దానిమీద క్లిక్‌ చేస్తే, JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది.

JW లైబ్రరీ సంజ్ఞా భాష APKని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత, ఆ యాప్‌ కొత్త వర్షన్‌ అందుబాటులో ఉందేమో అప్పుడప్పుడూ చూసుకుంటూ ఉండండి. అందుకోసం ఇలా చేయండి:

  1. మీ డివైజ్‌లో ప్రస్తుతం ఏ వర్షన్‌ ఇన్‌స్టాల్‌ అయిందో తెలుసుకోవడానికి JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌లోని సెట్టింగ్‌లు పేజీ తెరవండి.

  2. మీ డివైజ్‌లో చూపించే వర్షన్‌ నంబర్‌, డౌన్‌లోడ్‌ బటన్‌ కింద చూపించే నంబర్‌ కన్నా తక్కువ ఉంటే, పైన ఇచ్చిన పద్ధతి ఉపయోగించి మళ్లీ APKని డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

వర్షన్‌: 5.1.2 (384897)