కంటెంట్‌కు వెళ్లు

2023, ఏప్రిల్‌ 7న జైలు నుండి విడుదలైన తర్వాత బ్రదర్‌ రుస్తమ్‌ సీద్కులీవ్‌ అలాగే అతని భార్య యూలియా

అక్టోబరు 19, 2023
రష్యా

జైలు నుండి విడుదలై బయటకు వచ్చేసిన బ్రదర్‌ రుస్తమ్‌ సీద్కులీవ్‌!

జైలు నుండి విడుదలై బయటకు వచ్చేసిన బ్రదర్‌ రుస్తమ్‌ సీద్కులీవ్‌!

2023, ఏప్రిల్‌ 7న బ్రదర్‌ రుస్తమ్‌ సీద్కులీవ్‌ రష్యా జైలు నుండి విడుదలయ్యాడు. అతను చాలా నెలలు ఎదురుచూసిన తర్వాత రష్యా ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేసి 2023, సెప్టెంబరు 17న దేశం నుండి బహిష్కరించి తుర్క్‌మెనిస్తాన్‌కు పంపించేసింది. అతని భార్య యూలియా అతన్ని తిరిగి కలుసుకోవాలని ఎంతో ఎదురుచూస్తుంది.

రుస్తమ్‌ దాదాపు 7 నెలలు గృహ నిర్బంధంలో, అలాగే దాదాపు 23 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ సమయం అంతట్లో అతను తన ధైర్యాన్ని, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదు. జైలు నుండి రాసిన ఒక ఉత్తరంలో బైబిల్లోని ఉదాహరణలు అతను సహించడానికి సహాయం చేస్తున్నాయని చెప్పాడు. అతను ఇలా రాశాడు: “ముఖ్యంగా నాబోతు అలాగే మెఫీబోషెతు ఉదాహరణలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయి. వాళ్లను అన్యాయంగా నిందించినా వాళ్లు మాత్రం వాళ్ల యథార్థతను, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నేను కూడా నా పరిస్థితిని తట్టుకోవడానికి, అలాగే నిరీక్షణను నా కళ్ల ముందు ఉంచుకోవడానికి వాళ్ల ఉదాహరణలు ఎంతో సహాయం చేస్తున్నాయి.”

జైల్లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి యూలియాకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే అనుమతి దొరికేది. కానీ వాళ్లు ప్రతీరోజు ఫోన్‌లో మాట్లాడుకుంటూ దినవచనాన్ని చర్చించుకునేవాళ్లు; అలా ఒకరినొకరు బలపర్చుకోగలిగారు.

రుస్తమ్‌ జైలుకి వెళ్లేముందు ఇలా అన్నాడు: “ప్రతీది యెహోవా చేతుల్లోనే ఉందని ఆయన సరైన సమయంలో, సరైన విధంగా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను నా నిండు మనసుతో ఆయన్ని నమ్ముతూ ఉండాలి.”

రుస్తమ్‌ అలాగే యూలియా దేవున్ని తమ ఆశ్రయంగా, కోటగా చేసుకుంటుండగా యెహోవా వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటాడని మేము నమ్ముతున్నాం.—కీర్తన 91:2.