కంటెంట్‌కు వెళ్లు

అక్టోబరు 23, 2023
ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది

ఇజ్రాయెల్‌, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది

2023, అక్టోబరు 7 నుండి ఇజ్రాయెల్‌, గాజా ప్రాంతాల్లో భీకరమైన దాడులు, హింస చెలరేగుతుంది. వేలమంది తమ ఇళ్లను వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పటికే 4,200 మంది చనిపోయారని నివేదికలు అంచనా వేస్తున్నాయి.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఎవ్వరూ గయపడలేదు, చనిపోలేదు

  • 93 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 3 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • రాజ్యమందిరాలు ఏవీ పాడవ్వలేదు

సహాయక చర్యలు

  • ప్రాంతీయ పర్యవేక్షకులు, స్థానిక పెద్దలు యుద్ధం వల్ల నష్టపోయినవాళ్లకు అవసరమైన సహాయం చేస్తున్నారు; అలాగే ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు

  • అవసరమైన మద్దతు ఇవ్వడానికి ఒక విపత్తు సహాయక కమిటీ ఏర్పాటు చేయబడింది

ఒక బ్రదర్‌, అతని భార్య, అలాగే మరో ఇద్దరు సిస్టర్స్‌ ఒక చోట తలదాచుకున్నారు; వాళ్లు దేవుని వాక్యం నుండి ఓదార్పును, బలాన్ని పొందుతున్నారు

అక్కడ ఉంటున్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌ వీడియో కాన్‌ఫరెన్స్‌ ద్వారా కలుసుకుంటూ యెహోవాను ఆరాధించడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా చెప్తున్నాడు: “కష్టాల్లో ఉన్నా, రెపనే రోజు ఎలా ఉంటుందో తెలియకపోయినా మన ప్రియమైన బ్రదర్స్‌సిస్టర్స్‌ గొప్ప విశ్వాసాన్ని, ఒకరి మీద ఒకరు స్వార్థంలేని ప్రేమను చూపిస్తున్నారు. అది చూడడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది.”

బైబిలు మాటిస్తున్నట్టు, దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా” చేసే రోజు కోసం మేము ఎంతో ఎదురుచూస్తున్నాం.—కీర్తన 46:9.