కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Military equipment: Anton Petrus/Moment via Getty Images; money: Wara1982/iStock via Getty Images Plus

అప్రమత్తంగా ఉండండి!

యుద్ధాల కోసం లక్షల కోట్లు—అంతకుమించిన నష్టం

యుద్ధాల కోసం లక్షల కోట్లు—అంతకుమించిన నష్టం

 యుద్ధాల వల్ల ఊహకందనంత నష్టం జరుగుతుంది.

  •   “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ముందెప్పుడూ లేనంతగా, పోయిన సంవత్సరం యుద్ధాల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టారు.”—ద వాషింగ్‌టన్‌ పోస్ట్‌, ఫిబ్రవరి 13, 2024.

 డబ్బులే కాదు ఎన్నో ప్రాణాలు కూడా పోయాయి. ఉదాహరణకు, యుక్రెయిన్‌లో జరిగిన యుద్ధాన్నే తీసుకోండి.

  •   సైనికులు. రెండు సంవత్సరాల క్రితం మొదలైన యుద్ధంలో కొన్ని అంచనాల ప్రకారం, ఐదు లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు లేదా తీవ్రంగా గాయపడ్డారు.

  •   పౌరులు. యునైటెడ్‌ నేషన్స్‌ ప్రకారం 28,000 కన్నా ఎక్కువమంది చనిపోయారు లేదా గాయపడ్డారు. అయితే, ఒక UN అధికారి ఇలా అన్నాడు: “అసలు ఎంతమంది ప్రాణాలు పోయాయో కూడా లెక్కకు అందడం లేదు.” a

 యుద్ధాల వల్ల అలాగే అల్లర్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎంత నలిగిపోతున్నారో మాటల్లో చెప్పలేం.

  •   11.4 కోట్లు. 2023 సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, హింస వల్ల తమ ఇంటిని వదిలేసి వెళ్లినవాళ్ల సంఖ్య.

  •   78.3 కోట్లు. ఆకలితో కడుపు కాల్చుకుంటున్న వాళ్ల సంఖ్య. “ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడేవాళ్లలో 70 శాతం మంది యుద్ధాలు, హింస ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇప్పటికీ గొడవలు, అల్లర్లే ఆకలికి కారణం అవుతున్నాయి.”—వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌.

 యుద్ధాలు ఎప్పటికైనా ఆగిపోతాయా? శాంతి ఉంటుందనే ఆశ ఏమైనా ఉందా? భూమ్మీద ఎప్పటికైనా ఆకలి, పేదరికం కనుమరుగౌతాయా? బైబిలు ఏం చెప్తుంది?

యుద్ధాలు జరిగే కాలం

 గుర్రం మీద స్వారీ చేసే వ్యక్తిని వర్ణిస్తూ భూమంతా యుద్ధాలు జరుగుతాయని బైబిలు ముందే చెప్పింది.

  •   “ఎర్రగా ఉన్న ఇంకో గుర్రం వచ్చింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి భూమ్మీద శాంతి లేకుండా చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. ప్రజలు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశంతో అలా అనుమతి ఇవ్వబడింది. అంతేకాదు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది.”—ప్రకటన 6:4.

 ఈ గుర్రం మీద స్వారీ చేసే వ్యక్తి వెనక ఇంకో ఇద్దరు కూడా వస్తారు. భయంకరమైన వ్యాధులు లేదా వేరే కారణాల వల్ల వచ్చే చావును, కరువును వాళ్లు సూచిస్తున్నారు. (ప్రకటన 6:5-8) ఈ బైబిలు ప్రవచనం గురించి తెలుసుకోవడానికి, అది మన రోజుల్లో నిజమౌతుందని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవడానికి “నాలుగు గుర్రాల మీద స్వారీ చేస్తున్న వ్యక్తులు ఎవరు?” (ఇంగ్లీష్‌) ఆర్టికల్‌ చదవండి.

రాబోయే శాంతి

 త్వరలో ఇక యుద్ధాల కోసం డబ్బు వృథా కాదు. అయితే, అది మనుషుల వల్ల అయ్యే పని కాదు. బైబిలు ఇలా చెప్తుంది:

  •   దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తన 46:9.

  •   యుద్ధాల వల్ల జరిగిన నష్టాన్ని దేవుడు తీసేస్తాడు. “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:4.

  •   అందరూ ప్రశాంతంగా బ్రతికేలా దేవుడు చూసుకుంటాడు. “నా ప్రజలు ప్రశాంతమైన నివాస స్థలంలో, సురక్షితమైన నివాసాల్లో, నెమ్మదిగల విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.”—యెషయా 32:18.

 బైబిలు ప్రవచనం ప్రకారం, ఇప్పుడు మనం చూసే యుద్ధాలు, వేరే సంఘటనలు త్వరలోనే లోకం అంతా శాంతిగా మారబోతుందని చూపిస్తున్నాయి.

 ఆ శాంతిని దేవుడు ఎలా తెస్తాడు? పరలోకంలో ఉన్న తన ప్రభుత్వం లేదా రాజ్యం ద్వారా ఆయన అలా చేస్తాడు. (మత్తయి 6:10) ఆ రాజ్యం అంటే ఏంటో, అది తెచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవడానికి దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే చిన్న వీడియో చూడండి.

a మిరోస్లావ్‌ జెన్కా, యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రెటరీ-జనరల్‌ ఫర్‌ యూరప్‌, డిసెంబరు 6, 2023.