కంటెంట్‌కు వెళ్లు

రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?

రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?

పరిస్థితులు . . .

  • ఇలాగే ఉంటాయా?

  • ఇంకా చెడిపోతాయా?

  • బాగౌతాయా?

ఒక ప్రాచీన గ్రంథంలో ఇలా ఉంది:

‘దేవుడు వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.’—ప్రకటన 21:3, 4, కొత్త లోక అనువాదం.

ఆ మాటలు నెరవేరినప్పుడు . . .

సంతృప్తినిచ్చే చక్కని పని మీకు ఉంటుంది.—యెషయా 65:21-23.

రోగాలు, బాధలు ఉండవు.—యెషయా 25:8; 33:24.

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఎప్పటికీ సంతోషంగా జీవించవచ్చు.—కీర్తన 37:11, 29.

ఆ మాటలు ఎందుకు నమ్మవచ్చు?

రెండు కారణాలు పరిశీలించండి.

  • దేవుడు మాట నిలబెట్టుకుంటాడు. ఆ ప్రాచీన గ్రంథం యెహోవా దేవుణ్ణి మాత్రమే “సర్వశక్తిమంతుడు” అని పిలుస్తుంది, ఎందుకంటే ఆయనకు అంతులేని శక్తి ఉంది. (ప్రకటన 15:3) కాబట్టి మంచి పరిస్థితులు తెస్తానని తాను ఇచ్చిన మాటను యెహోవా తప్పకుండా నిలబెట్టుకుంటాడు. “దేవునికి అన్నీ సాధ్యమే” అని ఆ గ్రంథం చెప్తుంది.—మత్తయి 19:26.

  • మాట నిలబెట్టుకోవాలనే కోరిక కూడా దేవునికి ఉంది. ఉదాహరణకు, చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించాలని యెహోవా ‘ఎంతో కోరుకుంటున్నాడు.’—యోబు 14:14, 15.

    అంతేకాదు, దేవుని కుమారుడైన యేసు రోగుల్ని బాగుచేశాడని ఆ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే, అలా చేయడం ఆయనకు ఇష్టం. (మార్కు 1:40, 41) తన తండ్రిలానే యేసు కూడా అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలని కోరుకున్నాడు.—యోహాను 14:9.

    దీన్నిబట్టి, రాబోయే రోజుల్లో సంతోషంగా జీవించేలా మనకు సహాయం చేయాలని యెహోవా, యేసు ఇద్దరూ కోరుకుంటున్నారని అర్థమౌతుంది.—కీర్తన 72:12-14; 145:16; 2 పేతురు 3:9.

ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .

రాబోయే రోజుల్లో దేవుడు పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నాడు?

మత్తయి 6:9, 10; దానియేలు 2:44 లో దానికి జవాబు ఉంది.