“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి

మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ఎలా మొదలైందో; దానికి, ఇప్పుడున్న మనకు ఎలాంటి సంబంధం ఉందో ఈ పుస్తకం వివరిస్తుంది.

మ్యాప్‌లు

ఇజ్రాయిల్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్ని అలాగే అపొస్తలుడైన పౌలు చేసిన మిషనరీ యాత్రల్ని చూపించే మ్యాప్‌లు.

పరిపాలక సభ నుండి ఉత్తరం

“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ” ఉన్నప్పుడు, యెహోవా సహాయం మనకు తప్పకుండా ఉంటుందని ఎందుకు నమ్మవచ్చు?

అధ్యాయం 1

“వెళ్లి … శిష్యుల్ని చేయండి”

రాజ్య సందేశం అన్నిదేశాల్లో ప్రకటించబడుతుంది అని యేసు చెప్పాడు. ఆ మాట ఇప్పుడు ఎలా నెరవేరుతోంది?

అధ్యాయం 2

“మీరు నా గురించి సాక్ష్యమిస్తారు”

ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్లడానికి యేసు తన అపొస్తలుల్ని ఎలా సిద్ధం చేశాడు?

అధ్యాయం 3

“పవిత్రశక్తితో నిండిపోయారు”

క్రైస్తవ సంఘం మొదలవ్వడంలో పవిత్రశక్తి పాత్ర ఏంటి?

అధ్యాయం 4

“చదువుకోని సామాన్యులు”

అపొస్తలులు ధైర్యం చూపించారు, యెహోవా వాళ్లను దీవించాడు.

అధ్యాయం 5

“మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే”

అపొస్తలులు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం నిజ క్రైస్తవులందరికీ ఆదర్శంగా ఉంది.

అధ్యాయం 6

‘స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడు’

యూదుల న్యాయస్థానంలో స్తెఫను ధైర్యంగా తన వాదన వినిపించడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

అధ్యాయం 7

“యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం

మంచివార్త ప్రచారకుడిగా ఫిలిప్పు మనకు ఆదర్శం ఉంచాడు.

అధ్యాయం 8

“సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది”

సంఘాన్ని క్రూరంగా హింసించిన సౌలు, ఉత్సాహంగా ప్రకటించే క్రైస్తవుడు అయ్యాడు.

అధ్యాయం 9

“దేవునికి పక్షపాతం లేదు”

సున్నతి పొందని అన్యజనులకు క్రైస్తవులు ప్రకటించడం మొదలుపెట్టారు.

అధ్యాయం 10

“యెహోవా వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది”

దేవదూత పేతురును విడిపించాడు, హింస ప్రకటనా పనిని ఆపలేకపోయింది.

అధ్యాయం 11

‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’

ప్రజలు మంచివార్త విననప్పుడు పౌలు ఏం చేశాడు? మనం ఏం నేర్చుకోవచ్చు?

అధ్యాయం 12

‘యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడారు’

పౌలు బర్నబాలు వినయం, పట్టుదల చూపించారు; ప్రజలకు తగ్గట్టు మాట్లాడే విధానాన్ని మార్చుకున్నారు.

అధ్యాయం 13

“చాలాసేపు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి”

సున్నతి గురించిన వివాదాంశం పరిపాలక సభ ముందుకు వెళ్లింది.

అధ్యాయం 14

“మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం”

పరిపాలక సభ ఒక ముఖ్యమైన నిర్ణయం ఎలా తీసుకుందో, ఆ నిర్ణయం సంఘాలన్నిటినీ ఎలా ఐక్యం చేసిందో తెలుసుకోండి.

అధ్యాయం 15

“సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు

విశ్వాసంలో స్థిరంగా ఉండేలా ప్రయాణ సేవకులు సంఘాలకు సహాయం చేశారు.

అధ్యాయం 16

“మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి”

పవిత్రశక్తి నిర్దేశానికి లోబడడం వల్ల, హింసను సంతోషంగా సహించడం వల్ల వచ్చిన దీవెనలు.

అధ్యాయం 17

‘లేఖనాలు అర్థంచేసుకునేలా సహాయం చేయడానికి ప్రయత్నించాడు’

థెస్సలొనీకలో, బెరయలో ఉన్న యూదులకు పౌలు పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇచ్చాడు.

అధ్యాయం 18

‘తన కోసం వెతికి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు’

ప్రజలకు తగ్గట్టు మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం ద్వారా పౌలు ఎలా చక్కగా సాక్ష్యమిచ్చాడు?

అధ్యాయం 19

“మాట్లాడుతూనే ఉండు, ఆపకు”

కొరింథులో పౌలు చేసిన పరిచర్యను పరిశీలిస్తే, మనం కూడా మన ప్రాంతంలో దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేసే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

అధ్యాయం 20

వ్యతిరేకత ఉన్నా “వాక్యం వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది”

దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ ఉండడానికి అపొల్లో, పౌలు ఎలా కృషి చేశారో తెలుసుకోండి.

అధ్యాయం 21

“ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను”

పౌలు పరిచర్యలో ఉత్సాహం చూపించాడు, పెద్దలకు సలహాలు ఇచ్చాడు.

అధ్యాయం 22

“యెహోవా ఇష్టమే జరగాలి”

యెహోవా ఇష్టమే చేయాలని నిర్ణయించుకుని పౌలు యెరూషలేముకు వెళ్లాడు.

అధ్యాయం 23

“ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి”

పౌలు అల్లరిమూకల ముందు, మహాసభ ముందు సత్యాన్ని సమర్థించాడు.

అధ్యాయం 24

“ధైర్యంగా ఉండు!”

యూదులు పన్నిన కుట్ర నుండి పౌలు ప్రాణాలతో బయటపడ్డాడు, అధిపతైన ఫేలిక్సు ముందు తన వాదన వినిపించాడు.

అధ్యాయం 25

“నేను కైసరుకే విన్నవించుకుంటాను!”

మంచివార్త తరఫున వాదించే విషయంలో పౌలు మంచి ఆదర్శం ఉంచాడు.

అధ్యాయం 26

“మీలో ఏ ఒక్కరూ చనిపోరు”

పౌలు ఎక్కిన ఓడ బద్దలైంది, అతను చెక్కుచెదరని విశ్వాసాన్ని అలాగే ప్రజల మీద ప్రేమను చూపించాడు.

అధ్యాయం 27

“పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వడం

పౌలు రోములో బందీ అయ్యాడు, అయినా ప్రకటిస్తూనే ఉన్నాడు.

అధ్యాయం 28

“భూమంతటా” సాక్ష్యం ఇవ్వడం

మొదటి శతాబ్దంలో యేసు అనుచరులు మొదలుపెట్టిన పనిని యెహోవాసాక్షులు కొనసాగిస్తున్నారు.

చిత్రాల పట్టిక

ఈ పుస్తకంలోని ముఖ్యమైన చిత్రాల లిస్టు.