కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమ చూపించండి

ప్రేమ చూపించండి

సమస్య

వివక్ష అనేది అంత తేలిగ్గా పోదు. ఒక వైరస్‌ను తీసేయడానికి సమయం, కృషి అవసరమైనట్టే, వివక్షను తీసేయడానికి కూడా సమయం, కృషి అవసరం. వివక్షను తీసేసుకోవడానికి మీరేం చేయవచ్చు?

బైబిలు సలహా

“ప్రేమను అలవర్చుకోండి. ఎందుకంటే ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది.”—కొలొస్సయులు 3:14.

అంటే . . . ప్రేమతో చేసే చిన్నచిన్న పనులు ప్రజల్ని ఒక్కటి చేస్తాయి. ప్రేమ చూపించే కొద్దీ మీలో ఉన్న వివక్ష మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మీ మనసును ప్రేమతో నింపుకున్నప్పుడు ద్వేషానికి, వివక్షకు చోటు ఉండదు.

మీరేం చేయవచ్చు?

మీకు చెడు అభిప్రాయం ఉన్న ప్రజల మీద ఏయే విధాలుగా ప్రేమ చూపించవచ్చో ఆలోచించండి. అందుకోసం మీరు గొప్పగొప్ప పనులు చేయనక్కర్లేదు. వీటిలో ఏదో ఒకటి లేదా కొన్ని చేయడానికి ప్రయత్నించండి:

ప్రేమతో మీరు చేసే ప్రతీ చిన్న పని, మీలో ఉన్న వివక్షను తరిమేస్తుంది

  • వాళ్ల కోసం తలుపు తెరిచి పట్టుకోవడం ద్వారా, లేదా బస్సులోనో రైలులోనో వాళ్లు నిలబడివుంటే సీటు ఇవ్వడం ద్వారా ప్రేమ చూపించవచ్చు.

  • వాళ్లకు మీ భాష అంతగా రాకపోయినా వాళ్లతో మాటలు కలపడానికి ప్రయత్నించండి.

  • వాళ్ల పనులు మీకు అర్థం కాకపోతే ఓపిక చూపించండి

  • వాళ్ల సమస్యల్ని చెప్తున్నప్పుడు సహానుభూతితో వినండి