కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 1 2023 | మానసిక ఆరోగ్యం కాపాడుకోండి​ఎలా?

మానసిక సమస్యలతో బాధపడేవాళ్లు అన్ని దేశాల్లో ఉన్నారు. డబ్బు, చదువు, దేశం, మతంతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని ముసలివాళ్ల దాకా కొన్ని లక్షలమంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఇంతకీ మానసిక సమస్యలు అంటే ఏంటి? మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు ఎలా అనిపిస్తుంది? ఈ పత్రిక, అలాంటివాళ్లు సరైన వైద్య సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో, వాళ్లకు ఉపయోగపడే ఎలాంటి సలహాలు బైబిల్లో ఉన్నాయో వివరిస్తుంది.

 

ప్రపంచమంతటా పెరుగుతున్న మానసిక సమస్యలు

మానసిక సమస్య ఎవరికైనా రావచ్చు. వయసు, దేశం, మతం, చదువు, డబ్బుతో దీనికి సంబంధం లేదు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బైబిలు సలహాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు

మీ ఆలోచనల్ని, భావాల్ని వేరే ఎవ్వరి కన్నా యెహోవా దేవుడు బాగా అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో మీరెందుకు ఉండవచ్చు?

1 | దేవునికి చెప్పుకోండి “మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి”

ఆందోళన కలిగించే ఏదైనా ఒక విషయం గురించి మీరు దేవునికి ఎలా చెప్పుకోవచ్చు? అలా చెప్పుకోవడం ఆందోళనతో బాధపడుతున్న వాళ్లకు ఎలా ఊరటనిస్తుంది?

2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”

మానసిక వేదన పడాల్సిన పరిస్థితే ఉండని ఒక కాలం వస్తుందని బైబిలు హామీ ఇస్తుంది.

3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు

కొంతమంది గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు వాళ్లకూ మనలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని; వాళ్ల ఆలోచనలు, ఫీలింగ్స్‌ మనలాగే ఉండేవని తెలుసుకున్నప్పుడు ఆందోళనను, డిప్రెషన్‌ను తట్టుకోవడం కాస్త తేలికౌతుంది.

4 | బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాలు

బైబిల్లో ఉన్న ప్రోత్సాహాన్నిచ్చే మాటలు చదవడం, చేరుకోగలిగే లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల మానసిక సమస్యల్ని తట్టుకోగలుగుతాం.

మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు మనం చేయగల సహాయం

మానసిక సమస్యతో బాధపడుతున్న మీ స్నేహితులకు మీ తోడు అవసరం కావచ్చు.