కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల్లో స్త్రీలు కూడా ప్రకటిస్తారా?

యెహోవాసాక్షుల్లో స్త్రీలు కూడా ప్రకటిస్తారా?

 ప్రకటిస్తారు. లక్షలాది స్త్రీలతో సహా యెహోవాసాక్షులందరూ ప్రచారకులే లేదా పరిచారకులే. “చాలా చాలామంది స్త్రీలు సువార్తను వ్యాప్తి చేస్తారు” అని బైబిలు ముందే చెప్పింది.—కీర్తన 68:11, NET బైబిల్‌.

 యెహోవాసాక్షుల్లో ఉన్న స్త్రీలు బైబిల్లో నమోదైన స్త్రీలను ఆదర్శంగా తీసుకుంటారు. (సామెతలు 31:10-31) వాళ్లు సంఘంలో నాయకత్వం వహించరు, అయితే బహిరంగ పరిచర్యలో పూర్తిగా భాగం వహిస్తారు. అంతేకాదు, వాళ్లు తమ పిల్లలకు బైబిలు సూత్రాలు నేర్పిస్తారు కూడా. (సామెతలు 1:8) తమ మాటలతో, పనులతో ఇతరుల మీద మంచి ప్రభావం చూపించడానికి ఎంతో కృషిచేస్తారు.—తీతు 2:3-5.