కంటెంట్‌కు వెళ్లు

తమది నిజమైన మతమని యెహోవాసాక్షులు నమ్ముతున్నారా?

తమది నిజమైన మతమని యెహోవాసాక్షులు నమ్ముతున్నారా?

 మతం విషయంలో నిష్ఠగా ఉండేవాళ్లు తాము ఎంచుకున్నది దేవుడు, యేసు అంగీకరిస్తున్నారా అని ఆలోచించాలి. అలా చేయకపోతే, మతాన్ని అవలంబించి లాభం ఏమిటి?

 మతాలన్నీ, మార్గాలన్నీ రక్షణకు నడిపిస్తాయనే విషయాన్ని యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. కానీ ఆయనిలా అన్నాడు: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:13, 14) ఆ మార్గాన్ని కనుగొన్నామని యెహోవాసాక్షులు నమ్ముతారు. లేకపోతే వాళ్లు మరో మతం కోసం వెతుకుతారు.