కంటెంట్‌కు వెళ్లు

బైబిలు సారాంశం

బైబిలు సారాంశం

ప్రపంచంలో ఎక్కువమంది దగ్గర ఉన్న పుస్తకం బైబిలు. దాన్ని చదవడానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ‘ఎంతో పేరున్న ఈ పుస్తకంలో అసలు దేని గురించి ఉంది?’ అనే సందేహం మీకు రావచ్చు.

బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషురు బైబిలు సారాంశాన్ని మీకు తేలిగ్గా అర్థమయ్యేలా క్లుప్తంగా వివరిస్తుంది. అంటే ఆదికాండంలో ఉన్న సృష్టి గురించి మొదలుకొని, ప్రకటన గ్రంథం మాట్లాడుతున్న అందమైన భవిష్యత్తు వరకున్న సారాంశాన్ని ఇది వివరిస్తుంది. ఇందులో ఉన్న కాలరేఖ కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్న సంవత్సరాలను తెలియజేస్తుంది. వీటితోపాటు ఆకట్టుకునే చిత్రాలు, ఆలోచించేలా చేసే ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయి.

బైబిలు—దానిలో మీకు ఒక సందేశం బ్రోషురును మీరు ఆన్‌లైన్‌లో చదవచ్చు.