కంటెంట్‌కు వెళ్లు

బైబిలు పుస్తకాలకు పరిచయం

బైబిలు పుస్తకాల్ని ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు, వాటిలో ఏమేమి ఉన్నాయి వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఈ చిన్న వీడియోలు తెలియజేస్తాయి. మీరు ప్రతీరోజు బైబిలు చదువుకుంటున్నప్పుడు, అందులోని విషయాల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు వీటిని ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి.

ఆదికాండంకు పరిచయం

మనుషుల ఆరంభం గురించి, కష్టాలు-మరణం మొదలవ్వడం గురించి ఆదికాండం పుస్తకం ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

నిర్గమకాండంకు పరిచయం

దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, తనకు సమర్పించుకున్న జనంగా వాళ్లను ఏర్పాటు చేసుకున్నాడు.

లేవీయకాండంకు పరిచయం

దేవుని పవిత్రత గురించి, మనం పవిత్రంగా ఉండడానికి గల ప్రాముఖ్యత గురించి లేవీయకాండం వివరిస్తుంది.

సంఖ్యాకాండంకు పరిచయం

యెహోవాకు లోబడడం, నాయకత్వం వహించడానికి ఆయన నియమించిన వాళ్లను గౌరవించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోండి.

ద్వితీయోపదేశకాండంకు పరిచయం

ఇశ్రాయేలీయులకు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ద్వారా తన ప్రజల మీద ఎంత ప్రేమ చూపించాడో తెలుసుకోండి.

యెహోషువకు పరిచయం

దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు జనం ఎలా జయించి స్వాస్థ్యాన్ని పొందారో తెలుసుకోండి.

న్యాయాధిపతులకు పరిచయం

యెహోవా తన ప్రజల్ని అణచివేత నుండి కాపాడడానికి విశ్వాసం, ధైర్యం ఉన్న న్యాయాధిపతుల్ని ఉపయోగించుకున్నాడు. వాళ్లు చేసిన పనుల గురించి వివరించే ఈ పుస్తకానికి వాళ్ల పేరే పెట్టబడింది.

రూతుకు పరిచయం

యౌవనంలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, విధవరాలైన తన అత్తపట్ల స్వయంత్యాగపూరిత ప్రేమను చూపించింది. వాళ్లిద్దర్నీ యెహోవా ఎలా దీవించాడో రూతు పుస్తకం చెప్తుంది.

1 సమూయేలుకు పరిచయం

ఇశ్రాయేలు చరిత్రలో న్యాయాధిపతులకు బదులుగా రాజులు పరిపాలించడం ఎలా మొదలుపెట్టారో తెలుసుకోండి.

2 సమూయేలుకుపరిచయం

దావీదు ఎంతోమందికి బాగా ఇష్టమైన, బాగా తెలిసిన బైబిలు వ్యక్తి. ఆయన చూపించిన వినయం, విశ్వాసం గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.

1 రాజులకు పరిచయం

సొలొమోను పరిపాలించిన రోజుల్లో ఇశ్రాయేలు రాజ్యం ఎంత వైభవంగా, సమృద్ధిగా ఉందో తెలుసుకోండి; అలాగే అది ఇశ్రాయేలు రాజ్యంగా, యూదా రాజ్యంగా ఎలా రెండుగా విడిపోయిందో తెలుసుకోండి.

2 రాజులకు పరిచయం

ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం మతభ్రష్టత్వంతో నిండిపోయింది; అలాంటి పరిస్థితుల మధ్య కూడా కొంతమంది ఎవరైతే పూర్తి హృదయంతో తనను ఆరాధిస్తూ ఉన్నారో యెహోవా వాళ్లను దీవించాడు.

1 దినవృత్తాంతాలకు పరిచయం

వివిధ వంశావళులు; దేవునికి భయపడి జీవించిన దావీదు ఇశ్రాయేలుకు రాజవ్వడం మొదలుకొని, చనిపోయేంతవరకు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఇందులో ఉన్నాయి.

ఎజ్రాకి పరిచయం

బబులోను నుండి తన ప్రజల్ని విడిపిస్తానని, యెరూషలేములో సత్యారాధనను మళ్లీ తెస్తానని యెహోవా చేసిన వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు.

నెహెమ్యాకి పరిచయం

బైబిల్లో ఉన్న నెహెమ్యా పుస్తకం ఇప్పుడున్న సత్యారాధకులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది.

ఎస్తేరుకి పరిచయం

ఎస్తేరు కాలంలో జరిగినవి తెలుసుకుంటే యెహోవా నేడు కూడా తన ప్రజలను కష్టాలనుండి తప్పించగలడనే మన విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

యోబుకి పరిచయం

యెహోవాను ప్రేమించే వాళ్లందరూ పరీక్షించబడాలి. మనం యథార్థంగా ఉండగలము, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించగలము అనే మన నమ్మకాన్ని యోబు వృత్తాంతం పెంచుతుంది.

కీర్తనలకి పరిచయం

ఈ పుస్తకం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తుంది, తనను ప్రేమించేవాళ్లను యెహోవా ఎలా సహాయం చేసి ఓదారుస్తాడో చెప్తుంది, తన రాజ్యం ద్వారా ఈ భూమి ఎలా మారుతుందో వివరిస్తుంది.

సామెతలు పుస్తకానికి పరిచయం

వ్యాపార లావాదేవీల నుండి కుటుంబ వ్యవహారాల వరకు జీవితంలో అన్ని విషయాలకు సంబంధించి దేవుని ఆలోచనేమిటో తెలుసుకోండి.

ప్రసంగికి పరిచయం

రాజైన సొలొమోను జీవితంలో ముఖ్యమైన కొన్ని విషయాల గురించి చెప్తూ వాటిని దైవిక జ్ఞానానికి విరుద్ధమైన వాటితో పోలుస్తున్నాడు.

పరమగీతముకి పరిచయం

షూలమ్మీతీకి గొర్రెల కాపరి మీదున్న విడదీయరాని ప్రేమను “యెహోవా పుట్టించు జ్వాల” అని పిలిచారు. ఎందుకు?

యెషయాకి పరిచయం

యెషయా పుస్తకం ప్రవచించిన విషయాల్లో ఒక్క పొల్లు కూడా తప్పిపోలేదు. దాన్నిబట్టి, వాగ్దానాల్ని నెరవేర్చి మనల్ని రక్షించగల యెహోవా మీద మన నమ్మకం బలపడుతుంది.

యిర్మీయాకి పరిచయం

తీవ్రమైన కష్టాల్లో కూడా యిర్మీయా తన నియామకాన్ని నమ్మకంగా చేశాడు. అతని మంచి మాదిరి నేటి క్రైస్తవులు ఎలా సహాయం చేస్తుందో ఆలోచించండి.

విలాపవాక్యములకి పరిచయం

ప్రవక్త అయిన యిర్మీయా రాశాడు, యెరూషలేము నాశనమైందనే బాధ, పశ్చాత్తాపం చూపిస్తే దేవుని కరుణను చూస్తారనే వాస్తవం విలాపవాక్యములు పుస్తకంలో కనిపిస్తాయి.

యెహెజ్కేలుకి పరిచయం

దేవుడు ఇచ్చిన ఎలాంటి కష్టమైన నియామకాన్నైనా యెహెజ్కేలు ప్రవక్త వినయంగా, ధైర్యంగా చేశాడు. ఆయన ఆదర్శం నేడు మనకెంతో ఉపయోగపడుతుంది.

దానియేలుకి పరిచయం

దానియేలు, ఆయన స్నేహితులు అన్నిరకాల పరిస్థితుల్లోనూ యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. వాళ్ల ఆదర్శం నుండి, దానియేలు పుస్తకంలోని ప్రవచన నెరవేర్పును నుండి ఇప్పుడు అలాగే అంతం సమయంలో మనం ప్రయోజనం పొందవచ్చు.

హోషేయకి పరిచయం

పశ్చాత్తాపం చూపించే తప్పిదస్థుల పట్ల యెహోవా చూపించే కరుణ, ఆయన మన నుండి కోరుకునే ఆరాధన గురించి నేడు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏమిటో హోషేయ ప్రవచనం వివరిస్తుంది.

యోవేలుకి పరిచయం

యోవేలు ప్రవక్త త్వరలో రాబోతున్న “యెహోవా రోజు” గురించి ప్రవచించాడు, దాంతోపాటు కాపాడబడాలంటే ఏం చేయాలో కూడా చెప్పాడు. ఆయన చెప్పిన ప్రవచనం ఈ కాలానికి ఎంతో అవసరం.

ఆమోసుకి పరిచయం

ఒక ప్రాముఖ్యమైన పని కోసం యెహోవా ఈ వినయస్థుడిని ఉపయోగించుకున్నాడు. ఆమోసు ఉంచిన ఆదర్శం నుండి మనం ఏ విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు?

ఓబద్యాకి పరిచయం

అది హెబ్రీ లేఖనాల్లో అన్నిటికన్నా చిన్న పుస్తకం. దానిలోని ప్రవచనం నిరీక్షణను ఇస్తుంది, యెహోవా రాజ్యాధికారం శాశ్వత కాలంపాటు నిలిచి ఉంటుందని వాగ్దానం చేస్తుంది.

యోనాకి పరిచయం

యోనా ప్రవక్త దిద్దుబాటును అంగీకరించి, తనకిచ్చిన నియామకాన్ని పూర్తి చేశాడు, అలాగే దేవుని ప్రేమ, కరుణ గురించి పాఠాలు నేర్చుకున్నాడు. ఆయన అనుభవాలు మీ హృదయాన్ని కదిలిస్తాయి.

మీకాకి పరిచయం

యెహోవా మననుండి మరీ ఎక్కువ ఆశించడని అలాగే మనకు ప్రయోజనం చేకూర్చే పనులే చేయమంటాడని దేవుని ప్రేరణతో రాయబడిన ఈ ప్రవచన పుస్తకం మన నమ్మకాన్ని బలపరుస్తుంది.

నహూముకి పరిచయం

దేవుడు తానిచ్చిన మాటను ఎల్లప్పుడు నిలబెట్టుకుంటాడని, తన రాజ్యం తీసుకొచ్చే శాంతి, రక్షణ కోసం ఎదురుచూసే వాళ్లకు సేదదీర్పును దయచేస్తాడని ఈ ప్రవచనం మనకున్న నమ్మకాన్ని బలపరుస్తుంది.

హబక్కూకుకి పరిచయం

తన ప్రజల్ని సరైన సమయంలో, సరైన విధంగా ఎలా రక్షించాలో యెహోవాకు తెలుసనే నమ్మకంతో ఉండవచ్చు.

జెఫన్యాకి పరిచయం

యెహోవా తీర్పు దినం రాదు అనుకునే ప్రమాదంలో పడకుండా మనం ఎందుకు జాగ్రత్తపడాలి?

హగ్గయికి పరిచయం

మన సొంత అవసరాలకన్నా దేవుని ఆరాధనకే ప్రాముఖ్యత ఇవ్వమని ఈ ప్రవచనం నొక్కిచెప్తుంది.

జెకర్యాకి పరిచయం

గతంలో అనేక ప్రేరేపిత దర్శనాలు, ప్రవచనాలు దేవుని ప్రజల్ని బలపర్చాయి. నేడు కూడా అవే ప్రవచనాలు మనకు యెహోవా సహాయం ఉందనే భరోసానిస్తున్నాయి.

మలాకీకి పరిచయం

మలాకీ పుస్తకం మార్పులేని యెహోవా ప్రమాణాల గురించి, ఆయన కరుణ, ప్రేమ గురించి చెప్తుంది. అలాగే మన కాలానికి కూడా ఉపయోగపడే చక్కని పాఠాలు ఆ ప్రవచనం నేర్పిస్తుంది.

మత్తయికి పరిచయం

ఈ బైబిలు పుస్తకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు నేర్చుకుని ఆనందించండి. సువార్తల్లో ఇది మొదటి పుస్తకం.

మార్కుకి పరిచయం

సువార్తల్లో చిన్నదైన మార్కు పుస్తకం, భవిష్యత్తులో దేవుని రాజ్యానికి రాజుగా యేసు ఎలా పరిపాలించబోతున్నాడు అనే విషయాన్ని వెల్లడి చేస్తుంది.

లూకాకి పరిచయం

లూకా సువార్తలో ఏ ప్రత్యేకమైన సమాచారం ఉంది?

యోహానుకి పరిచయం

మనుషులపట్ల యేసుకున్న ప్రేమ గురించి, వినయం చూపించే విషయంలో ఆయన ఆదర్శం గురించి, మెస్సీయగా, దేవుని రాజ్యానికి రాజుగా ఆయన పాత్ర గురించి యోహాను పుస్తకం తెలియజేస్తుంది.

అపొస్తలుల కార్యాలుకి పరిచయం

అన్ని దేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయడంలో తొలి క్రైస్తవులు కష్టపడి పనిచేశారు. పరిచర్య పట్ల మీకున్న ఆసక్తిని, ఉత్సాహాన్ని అపొస్తలుల కార్యాలు పుస్తకం పెంచగలదు.

రోమీయులకు పరిచయం

దేవుని ప్రేరణతో రాసిన ఈ ఉత్తరంలో యెహోవా నిష్పక్షపాతం గురించిన నిర్దేశాలు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యమనే సమాచారం ఉన్నాయి.

1 కొరింథీయులకు పరిచయం

పౌలు రాసిన ఈ ఉత్తరంలో ఐక్యత, నైతిక పరిశుభ్రత, ప్రేమ, పునరుత్థానం గురించిన ప్రేరేపిత సలహాలు ఉన్నాయి.

2 కొరింథీయులకు పరిచయం

“ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు” అయిన యెహోవా తన సేవకులను బలపరుస్తాడు, సంరక్షిస్తాడు.

గలతీయులకు పరిచయం

పౌలు గలతీయులకు రాసిన ఉత్తరం వాళ్లకు ఎంత ఉపయోగపడిందో నేడు కూడా మనకు అంతే ఉపయోగపడుతుంది. అది నిజక్రైస్తవులు అందరూ నమ్మకంగా ఉండడానికి సహాయం చేస్తుంది.

ఎఫెసీయులకు పరిచయం

దేవుడు రాయించిన ఈ ఉత్తరంలో యేసుక్రీస్తు ద్వారా శాంతిని, ఐక్యతను తీసుకురావాలనే దేవుని ఉద్దేశాన్ని ముఖ్యంగా చూస్తాం.

ఫిలిప్పీయులకు పరిచయం

మనం హింసలు ఎదుర్కొన్నా విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పడు వేరేవాళ్లు మన నుండి ప్రోత్సాహం పొందుతారు.

కొలొస్సయులకు పరిచయం

మనం నేర్చుకుంటున్న దాన్ని పాటిస్తూ; ఒకరినొకరం మనస్ఫూర్తిగా క్షమించుకుంటూ; క్రీస్తు స్థానాన్ని, అధికారాన్ని గుర్తిస్తూ ఉంటే యెహోవాను సంతోషపెడతాం.

1 థెస్సలొనీకయులకు పరిచయం

మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలి, ‘అన్నిటినీ పరీక్షించాలి,’ ‘ఎప్పుడూ ప్రార్థించాలి,’ ‘ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలి.’

2 థెస్సలొనీకయులకు పరిచయం

యెహోవా రోజుకు సంబంధించిన ఒక తప్పుడు అభిప్రాయాన్ని పౌలు సరిదిద్దుతాడు, అలాగే విశ్వాసంలో స్థిరంగా ఉండమని సహోదరులను ప్రోత్సహిస్తాడు.

1 తిమోతికి పరిచయం

సంఘం పాటించాల్సిన పద్ధతుల్ని తెలియజేయడానికి, అబద్ధ బోధల గురించి, డబ్బు మీద మోజు గురించి హెచ్చరించడానికి అపొస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రికను రాశాడు.

2 తిమోతికి పరిచయం

పరిచర్యను పూర్తిగా నెరవేర్చమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు.

తీతుకి పరిచయం

పౌలు తీతుకు రాసిన ఉత్తరంలో క్రేతు సంఘాల్లో ఉన్న సమస్యల గురించి, సంఘ పెద్దలకు ఉండాల్సిన లక్షణాల గురించి ఉంది.

ఫిలేమోనుకు పరిచయం

ఈ ఉత్తరం చిన్నదే అయినప్పటికీ వినయం, దయ, క్షమాగుణం గురించిన శక్తివంతమైన పాఠాలు ఇందులో ఉన్నాయి.

హెబ్రీయులు పుస్తకానికి పరిచయం

క్రైస్తవుల ఆరాధన కంటికి కనిపించే ఆలయాల మీద, జంతు బలుల మీద కాదుగానీ, అంతకన్నా గొప్పవాటి మీద ఆధారపడి ఉంది.

యాకోబుకు పరిచయం

యాకోబు స్పష్టమైన పదచిత్రాలు ఉపయోగించి ప్రాముఖ్యమైన క్రైస్తవ సూత్రాలను బోధించాడు.

1 పేతురుకి పరిచయం

మనం చురుగ్గా ఉండాలని, మన ఆందోళనంతా దేవుని మీద వేయాలని పేతురు తన మొదటి పత్రిక ద్వారా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.

2 పేతురుకి పరిచయం

పేతురు రాసిన రెండో పత్రిక, మనం కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం నమ్మకంగా ఎదురుచూసేలా ప్రోత్సహిస్తుంది.

1 యోహానుకు పరిచయం

యోహాను ఉత్తరం క్రీస్తువిరోధుల గురించి మనల్ని హెచ్చరిస్తుంది, మనం దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదో చూపిస్తుంది.

2 యోహానుకు పరిచయం

సత్యంలో నడుస్తూ ఉండమని యోహాను రెండో ఉత్తరం మనకు గుర్తుచేస్తుంది, మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రోత్సహించాడు.

3 యోహానుకు పరిచయం

యోహాను మూడో ఉత్తరం క్రైస్తవ ఆతిథ్యం గురించి చక్కని పాఠం నేర్పిస్తుంది.

యూదాకు పరిచయం

క్రైస్తవుల్ని మోసం చేయాలని, భ్రష్టు పట్టించాలని ప్రయత్నించేవాళ్ల పనుల్ని బట్టబయలు చేశాడు.

ప్రకటనకు పరిచయం

దేవుని రాజ్యం ద్వారా, భూమి విషయంలో అలాగే మానవజాతి విషయంలో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడాన్ని ప్రకటన పుస్తకం కళ్లకు కట్టినట్లు ఎలా తెలియజేస్తుందో గమనించండి.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

పుస్తకాలు & బ్రోషుర్‌లు

బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది

బైబిల్లో ఉన్న ప్రాథమిక సందేశం ఏమిటి?