కంటెంట్‌కు వెళ్లు

సాతాను ఎక్కడ ఉంటాడు?

సాతాను ఎక్కడ ఉంటాడు?

బైబిలు ఇచ్చే జవాబు

 సాతాను అదృశ్యప్రాణి కాబట్టి అతను ఉండే చోటు మన కళ్లకు కనిపించదు. అయితే, ఈ ఆర్టికల్‌లోని చిత్రంలో చూపించినట్టు, అతను ఉండే చోటు చెడ్డవాళ్లను హింసించే భయంకరమైన నరకం కాదు.

‘పరలోకంలో యుద్ధం’

 దేవుడు అపవాదియైన సాతానును కొంతకాలంపాటు పరలోకంలో తిరగడానికీ, నమ్మకమైన దేవదూతలతోపాటు తన దగ్గరకు రావడానికీ అనుమతించాడు. (యోబు 1:6) అయితే “పరలోకమందు యుద్ధము” జరుగుతుందని, సాతాను పరలోకం నుండి ‘భూమి మీద పడద్రోయబడతాడని’ బైబిలు ముందే చెప్పింది. (ప్రకటన 12:7-9) బైబిలు కాలక్రమం బట్టి, ప్రపంచ సంఘటనలను బట్టి పరలోకంలో ఈ యుద్ధం ఇప్పటికే జరిగిపోయిందని అర్థమౌతుంది. కాబట్టి సాతాను ఇప్పుడు కేవలం భూమికే పరిమితమయ్యాడు.

 అయితే సాతాను భూమ్మీద ఒక ప్రత్యేక స్థలంలో ఉంటున్నాడని దానర్థమా? ఉదాహరణకు ప్రాచీన పట్టణమైన పెర్గమును “సాతాను సింహాసనమున్న స్థలము,” “సాతాను కాపురమున్న … స్థలము” అని బైబిలు పిలిచింది. (ప్రకటన 2:13) నిజానికి ఈ మాటలు ఆ పట్టణంలో విస్తృతంగా జరిగే సాతాను ఆరాధనను సూచిస్తున్నాయి. సాతాను “భూలోకరాజ్యములన్నిటి” మీద అధికారం చలాయిస్తున్నాడని బైబిలు చెప్తుంది. కాబట్టి అతను భూమ్మీద ఒక ప్రత్యేక స్థలంలో ఉండడుగానీ, భూమంతా తిరుగుతూ ఉంటాడని అర్థంచేసుకోవచ్చు.—లూకా 4:5, 6.