కంటెంట్‌కు వెళ్లు

యేసు సిలువ మీద చనిపోయాడా?

యేసు సిలువ మీద చనిపోయాడా?

బైబిలు ఇచ్చే జవాబు

 సిలువ అంటేనే క్రైస్తవత్వానికి గుర్తని చాలామంది అనుకుంటారు. అయితే, యేసు దేనిమీద చనిపోయాడో బైబిలు చెప్పడం లేదు. కాబట్టి యేసు ఇలాంటి దానిమీదే చనిపోయాడని దాని రూపురేఖల గురించి ఎవ్వరూ ఖచ్ఛితంగా చెప్పలేరు. కానీ యేసు, సిలువ అని పిలిచే నిలువు అడ్డ కర్రల మీద కాదుగానీ ఒక నిలువుగా ఉండే కొయ్యమీద చనిపోయాడని మాత్రం బైబిలు రుజువు చేస్తుంది.

 యేసుని వేలాడదీసి చంపిన కొయ్య గురించి చెప్పేటప్పుడు బైబిలు సహజంగా స్టారస్‌ అనే గ్రీకు పదాన్ని ఉపయోగిస్తుంది. (మత్తయి 27:40; యోహాను 19:17) అనువాదాలు తరచూ ఈ పదాన్ని “సిలువ,” అని ఉపయోగించినా దాని అసలు అర్థం మాత్రం “నిలువ కర్ర” a అని చాలామంది విద్వాంసులు ఒప్పుకుంటారు. ఎ క్రిటికల్‌ లెక్సికాన్‌ అండ్‌ కొంకార్డెన్స్‌ టు ది ఇంగ్లీష్‌ అండ్‌ గ్రీక్‌ న్యూ టెస్టెమెంట్‌ ప్రకారం, స్టారస్‌ అనే పదానికి “ఏ విధంగానూ రెండు కర్రలను ఒకదానితో ఒకటి అతికించడం అనే అర్థం లేదు.”

 స్టారస్‌ అనే పదానికి బదులుగా అలాంటి అర్థాన్నే ఇచ్చే జైలాన్‌ అనే గ్రీకు పదాన్ని బైబిలు కొన్నిసార్లు వాడుతుంది. (అపొస్తలుల కార్యములు 5:30; 1 పేతురు 2:24) ఈ జైలాన్‌ అనే పదానికి “చెక్క,” “కలప,” “కొయ్య,” లేక “చెట్టు” అనే అర్థాలు ఉన్నాయి. b అందుకే ది కంపానియన్‌ బైబిలు ఇలా చెప్తుంది: “రెండు కలుప ముక్కల్ని వాడారు అని చెప్పడానికి గ్రీకు లేఖనాలైన కొత్త నింబంధనలో ఎలాంటి ఆధారమూ లేదు.”

మన ఆరాధనలో సిలువను ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా?

క్రక్స్‌ సింప్లెక్స్‌—నేరం చేసినవాళ్లను ఉరితీయడానికి ఉపయోగించే ఒక కర్రను సూచించే లాటిన్‌ పదం.

 యేసు దేనిమీద చనిపోయినా, కింది వాస్తవాలు, బైబిలు సత్యాలు మాత్రం మన ఆరాధనలో సిలువను ఉపయోగించకూడదని సూచిస్తున్నాయి.

  1.   మన ఆరాధనలో సిలువతోసహా మరి ఏ రూపాల్ని లేక గుర్తుల్ని ఉపయోగించడం దేవునికి ఇష్టం ఉండదు. ఇశ్రాయేలీయులు తమ ఆరాధనలో “ఏ రూపాన్ని” ఉపయోగించకూడదని దేవుడు వాళ్లకు ఆజ్ఞాపించాడు. అలాగే “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని క్రైస్తవులకు కూడా చెప్పాడు. —ద్వితీయోపదేశకాండము 4:15-19; 1 కొరింథీయులు 10:14.

  2.   మొదటి-శతాబ్దపు క్రైస్తవులు తమ ఆరాధనలో సిలువను ఉపయోగించలేదు. c అపోస్తలుల బోధలు, వాళ్ల మంచి ఆదర్శం క్రైస్తవులందరూ అంటిపెట్టుకొని ఉండాల్సిన చక్కని పద్ధతుల్ని నేర్పించాయి.—2 థెస్సలొనీకయులు 2:15.

  3.   ఆరాధనలో సిలువను ఉపయోగించే ఆచారం అన్యమత మూలాల నుండి వచ్చింది. d యేసు చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత, చర్చీలు ఆయన బోధల నుండి తొలగిపోయిన కాలంలో, చర్చీ కొత్త సభ్యులు “చాలావరకు తమ అన్యమత సంకేతాలను, గుర్తులను అలాగే ఉంచుకోవచ్చని” చర్చీలు వాళ్లకు అనుమతినిచ్చాయి. (ది ఎక్స్‌పాండెడ్‌ వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌) అయితే, కొత్త వాళ్లను మతంలోకి రాబట్టుకునేందుకు అన్యమత గుర్తులను అనుమంతించడాన్ని బైబిలు ఖండిస్తుంది.—2 కొరింథీయులు 6:17.

a డి. ఆర్‌. డబ్ల్యూ. ఉడ్‌ ఎడిట్‌ చేసిన న్యూ బైబిల్‌ డిక్షనరీ, మూడవ సంపుటి, 245వ పేజీ; థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌, 7వ వాల్యూమ్‌, 572వ పేజీ; ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్సైక్లోపీడియా, రివైజ్డ్‌ ఎడిషన్‌, 1వ వాల్యూమ్‌, 825వ పేజీ; ది ఇంపీరియల్‌ బైబిల్‌డిక్షనరీ, 7వ వాల్యూమ్‌, 84వ పేజీ చూడండి.

b ది ఎక్స్‌పాండెడ్‌ వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌, 1165వ పేజీ; లిడ్డెల్‌, స్కాట్‌ రాసిన ఎ గ్రీఇంగ్లీష్‌ లెక్సికాన్‌, 9వ సంపుటి, 1191-1192 పేజీలు; థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌, 5వ వాల్యూమ్‌, 37వ పేజీ చూడండి.

c ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 2003, ఎంట్రీ “క్రాస్‌”; ది క్రాస్‌—ఇట్స్‌హిస్టరీ అండ్‌ సింబాలిజమ్‌, 40వ పేజీ; ది కంపానియన్‌ బైబిల్‌, ఆక్స్‌స్ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, ఎపెండిక్స్‌ 162, 186వ పేజీ చూడండి.

d ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజియన్‌, 4వ వాల్యూమ్‌, 165వ పేజీ; ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా, 8వ వాల్యూమ్‌, 246వ పేజీ; సింబల్స్‌ ఎరౌండ్‌ అజ్‌, 205-207 పేజీలు చూడండి.