కంటెంట్‌కు వెళ్లు

యేసు జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు బైబిల్లో ఉన్నాయా?

యేసు జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు బైబిల్లో ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిలు రచయిత లూకా, యేసు జీవితం గురించి “మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసుకున్న” విషయాలే రాశానని చెప్పాడు.—లూకా 1:1-3.

 యేసుతోపాటు ఆయన కాలంలో జీవించిన మత్తయి, మార్కు, లూకా, యోహానులు రాసిన సువార్త పుస్తకాలు యేసు జీవితం గురించి ఇచ్చిన వివరాలు నాల్గవ శతాబ్దంలో లేదా సా.శ. 300 మధ్యకాలంలో మార్చారని కొందరు అన్నారు.

 అయితే 20వ శతాబ్దం మొదట్లో, యోహాను సువార్తలోని కొంతభాగం, ఈజిప్టులో దొరికింది. దాన్ని ఇప్పుడు పపైరస్‌ రైలాండ్స్‌ 457 (P52)గా పిలుస్తున్నారు. ఇంగ్లాండులోని మాంఛెస్టర్‌ పట్టణంలో ఉన్న జాన్‌ రైలాండ్స్‌ లైబ్రరీలో దీన్ని భద్రపరిచారు. ఇప్పుడున్న బైబిల్లో యోహాను 18:31-33, 37, 38 వచనాలే అందులో ఉన్నాయి.

 క్రైస్తవ గ్రీకు లేఖనాల అత్యంత ప్రాచీన రాతప్రతి ఇదే. అసలు రాతప్రతి రాసిన దాదాపు 25 సంవత్సరాలకే, అంటే సా.శ. 125 మధ్యకాలంలో దీన్ని రాశారని చాలామంది విద్వాంసులు నమ్ముతున్నారు. ఇందులోని విషయాలు, తర్వాత రాసిన రాతప్రతుల్లోని విషయాలు ఒకేలా ఉన్నాయి.