కంటెంట్‌కు వెళ్లు

జీవితానికి అర్థం ఏంటి?

జీవితానికి అర్థం ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

 ‘జీవితానికి అర్థం ఏంటి?’ ఇదే ప్రశ్నను, ‘మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం?’ అని లేదా ‘నా జీవిత ఉద్దేశం ఏంటి?’ అని కూడా అడగవచ్చు. దానికి జవాబుగా, దేవునితో స్నేహం పెంచుకోవడమే మన జీవితానికి ఉన్న ఉద్దేశం అని బైబిలు చెప్తుంది. బైబిలు చెప్తున్న ఈ ప్రాముఖ్యమైన సత్యాలను గమనించండి.

  •   మనల్ని దేవుడు సృష్టించాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఆయనే [దేవుడే] మనలను పుట్టించెను మనము ఆయన వారము.”—కీర్తన 100:3; ప్రకటన 4:10,11.

  •   మనల్ని, అలాగే తను సృష్టించిన ప్రతీ దాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు.—యెషయా 45:18.

  •   మన ‘ఆధ్యాత్మిక అవసరాన్ని’ గుర్తించే విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు. మన జీవితానికున్న అర్థాన్ని తెలుసుకోవడం కూడా అందులో భాగమే. (మత్తయి 5:3, NW) ఆ కోరికను తీర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు.—కీర్తన 145:16.

  •   దేవునితో స్నేహం చేయడం ద్వారా మనం మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకుంటాం. అది నిజంగా జరిగే పని కాదని కొంతమంది అనుకున్నా, బైబిలు ఇలా ప్రోత్సహిస్తుంది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకోబు 4:8; 2:23.

  •   దేవునికి స్నేహితులవ్వాలంటే, మన గురించి ఆయన ఉద్దేశించిన దానికి తగ్గట్టు మనం జీవించాలి. ఆ ఉద్దేశాన్ని బైబిల్లో ప్రసంగి 12:13 లో చూడవచ్చు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”

  •   త్వరలో దేవుడు చెడుతనాన్ని తీసేసి, తనకు నమ్మకంగా ఉన్న, తనను ఆరాధించేవాళ్లకు చావులేని జీవితాన్ని ఇస్తాడు. అప్పుడు, దేవుడు నిజంగా మనల్ని ఏ ఉద్దేశంతో చేశాడో అర్థంచేసుకుంటాం.—కీర్తన 37:10, 11.