కంటెంట్‌కు వెళ్లు

ముఖ్యమైన బైబిలు బోధలను తెలిపే వీడియోలు

దేవుడు భూమిని ఎందుకు చేశాడు? చనిపోయిన తర్వాత ఏమౌతుంది? మనుషులు కష్టాలు పడడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు ఈ చిన్న వీడియోల్లో ఉంటాయి.

విశ్వాన్ని ఎవరైనా సృష్టించారా?

మనుషులు రాసిన కథలు, కల్పితాలే బైబిల్లో ఉన్నాయని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మరి సృష్టి గురించి బైబిల్‌ చెప్పేది సరైనదని నమ్మవచ్చా?

దేవుడు ఉన్నాడని నమ్మొచ్చా?

దేవుడు ఉన్నాడు అని చూపించే కొన్ని అర్థవంతమైన రుజువుల్ని పరిశీలించండి.

దేవునికి పేరు ఉందా?

దేవున్ని మహోన్నతుడు, సృష్టికర్త, ప్రభువు అని చాలా రకాలుగా పిలుస్తాం. కానీ దేవునికి ఒక పేరుంది. అది బైబిల్లో 7000 సార్లు ఉంది.

దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలి?

ఎన్నో సంవత్సరాలుగా, ప్రజలు సృష్టికర్త గురించి తెలుసుకోవడం అవసరమని గుర్తించారు. దేవునితో స్నేహం చేయాలంటే ఏం చేయాలో బైబిలు మనకు చెప్తుంది. అలా స్నేహం చేయడానికి మనం వేసే మొదటి మెట్టు, ఆయన పేరు తెలుసుకోవడం.

బైబిలుకు మూలం ఎవరు?

బైబిల్ని మనుషులు వ్రాస్తే, దాన్ని దేవుని వాక్యం అని పిలవచ్చా? బైబిల్లో ఎవరి ఆలోచనలు ఉన్నాయి?

బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు?

బైబిల్ని రాయించింది నిజంగా దేవుడే అయితే, మిగతావాటికన్నా అది చాలా ప్రత్యేకంగా ఉండాలి.

దేవుడు భూమిని ఎందుకు చేశాడు?

ఈ భూమి ప్రకృతి అందాలతో నిండివుంది. భూమి సూర్యుని నుండి తగిన దూరంలో ఉండేలా, సరైన కోణంలో వంగి ఉండేలా, అలాగే సరైన వేగంతో పరిభ్రమించేలా దేవుడు చేశాడు. దేవుడు ఎందుకంత శ్రమతీసుకుని భూమిని తయారుచేశాడు?

జీవితానికి అర్థం ఏంటి?

నిజమైన సంతోషాన్ని, జీవితానికి అర్థాన్ని ఎలా సంపాదించుకోవచ్చో తెలుసుకోండి.

చనిపోయిన తర్వాత ఏమౌతుంది?

లాజరులానే చనిపోయినవాళ్లలో చాలామంది మళ్లీ బ్రతికే కాలం వస్తుందని బైబిలు మాటిస్తుంది.

చనిపోయినవాళ్లను దేవుడు నరకంలో శిక్షిస్తాడా?

“దేవుడు ప్రేమ,” కాబట్టి గతంలో చేసిన తప్పుల్ని బట్టి ఆయన మనల్ని చిత్రహింసలు పెట్టడని బైబిలు చెప్తుంది.

యేసుక్రీస్తు దేవుడా?

యేసుక్రీస్తు, సర్వశక్తిగల దేవుడు ఇద్దరూ ఒకటేనా లేక వేర్వేరు వ్యక్తులా?

యేసు ఎందుకు చనిపోయాడు?

బైబిల్లో యేసు మరణానికి ఎంతో విలువ ఉంది. ఆయన మరణానికి ఏదైనా కారణం ఉందా?

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

యేసు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే బోధించాడు. కొన్ని వందల సంవత్సరాలుగా, ఆ రాజ్యం రావాలని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు.

దేవుని రాజ్యం 1914 లో పరిపాలించడం మొదలుపెట్టింది

2,600 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, దేవుడు ఒక శక్తివంతమైన రాజుకు కల రప్పించాడు. ఆ కలలో చూపించిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతోంది.

1914 నుండి లోకం మారిపోయింది

1914 నుండి ప్రపంచ పరిస్థితులు, ప్రజల ప్రవర్తన మారిపోవడం మనం చూస్తున్నాం. “చివరి రోజుల” గురించి బైబిలు చెప్పిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయని ఇది చూపిస్తుంది.

ప్రకృతి విపత్తులకు దేవుడే కారణమా?

ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ఇద్దరు వ్యక్తులు, బైబిలు నుండి ఏం తెలుసుకున్నారో వాళ్ల మాటల్లోనే వినండి.

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

ఈ లోకం ఎందుకు ద్వేషంతో, బాధలతో నిండిపోయి ఉందని చాలామంది అడుగుతారు. బైబిలు దానికి సంతృప్తికరమైన, ఓదార్పుకరమైన సమాధానం ఇస్తుంది.

దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా?

మీరు ఏ మతంలో ఉన్నారనేది అంత ముఖ్యం కాదని చాలామంది అంటారు.

ఆరాధనలో విగ్రహాల్ని ఉపయోగిస్తే దేవుడు ఇష్టపడతాడా?

కంటికి కనిపించని దేవునికి అవి మనల్ని దగ్గర చేయగలవా?

దేవుడు అన్ని ప్రార్థనల్ని వింటాడా?

ఒకవ్యక్తి తన స్వార్థం కోసం ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడా? ఇంట్లో భార్యను హింసించి, తర్వాతి రోజు దేవుని దీవెనల కోసం ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడా?

పెళ్లి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు?

మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లోని మంచి సలహాలు ఎన్నో జంటలకు సహాయం చేశాయి.

అశ్లీల చిత్రాలు చూడడం దేవుని దృష్టిలో పాపమా?

“అశ్లీల చిత్రాలు” అనే మాట అసలు బైబిల్లో ఉందా? అశ్లీల చిత్రాల గురించి దేవుడు ఏం అనుకుంటున్నాడో మనం ఎలా తెలుసుకోవచ్చు?